అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి
కేసముద్రం, మేజర్ న్యూస్, అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇంచార్జీ డీఐజీ ఎన్.శ్వేత పోలీసులకు సూచించారు.బుధవారం వరంగల్ పోలీస్ కమీషనర్, భద్రాద్రి జోన్ ఇంచార్జీ డిఐజి ఎన్. శ్వేత బుధవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తో కలిసి కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యా లయంలోని వివిధ రికార్డులు,కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇంచార్జీ డిఐజి శ్వేత మాట్లాడుతూ..కేసుల దర్యాప్తులో నాణ్యత పాటించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేరాల నియంత్రణకు మండల పరిధిలో విజిబుల్ పోలీసింగ్, రాత్రి వేళల్లో గస్తీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.గంజాయి,ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణ,ఇసుక అక్రమ తవ్వకాలు, అసాంఘిక కార్యకలా పాలపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. 5ఎస్ విధానంలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహ రించాలని తెలిపారు. కాగా కేసముద్రం పోలీస్ అధికారుల పనితీరుతో పాటు రికార్డుల నిర్వహణను అభినందించారు. అదేవిధంగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కేసముద్రం సీఐవై.సత్యనారాయణ డీఐజీకి పూల మొక్క అందించి స్వాగతం పలుకగా, పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పిం చారు.ఈ తనిఖీలో కేసముద్రం సీఐ వై. సత్యనారాయణ, కేసముద్రం ఎస్‌ఐ క్రాంతి కిరణ్, ఇనుగుర్తి ఎస్‌ఐ పి.నరేష్, నెల్లికుదురు ఎస్‌ఐ జి.కర్ణాకర్ తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్: వెంకన్న, కేసముద్రం, మహబూబాద్ జిల్లా