BREAKING
గూగుల్‌పై మలేషియా ప్రభుత్వం రూ. 1,300 కోట్ల దావా: నేటి రాశి ఫలాలు 26 నవంబర్, 2026 నేటి పంచాంగం26 నవంబర్, 2026 అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కరువు సహాయక చర్యలు చేపట్టాలి అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Select Suryaa Now
కరువు సహాయక చర్యలు చేపట్టాలి

పాలకుర్తి, మేజర్ న్యూస్, తెలంగాణ రాష్ట్ర లో ప్రజలు కరువు తో ఇబ్బందులు పడుతు న్నారని తక్షణమే రాష్ట్రంలో కరువు సహాయ చర్యలు చేపట్టాలని, రేషన్ షాపుల ద్వారా ప్రతి కుటుంబానికి 14 రకాల నిత్యవసర సరుకులు ఇవ్వాలని, రైతులకు పంట నష్టపరిహారం ఎకరానికి 50,000 అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సరైన అంచనా లేకుండా రైతులకు నష్టం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. బుధ వారం మండలంలోని గూడూరు గ్రామంలో పంట నష్ట జరిగిన  పంట పొలాలను సిపిఎం ప్రతినిధి బృందం తో జాన్ వెస్లీ పరిశీలించారు. అనం తరం మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమా వేశంలో వారు మాట్లా డుతూ నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్న 25 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే ఒక్క ఎకరాకు కూడా ఇప్పటి వరకు ఒక పైస కుడా ఇవ్వ లేదని, తమిళ నాడులో ఐదు వేలు చొప్పున, కర్ణాటకలో ఆర్థిక సాయం చేశారని, ఆంధ్రప్రదేశ్ లో నష్టపరిహారం అందిస్తున్నారని, తెలంగాణ లో ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రైతులను ఆదుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని,వరి పంట వేస్తే ఎకరాకు 30000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, పత్తి కి మొక్కజొన్న కి ఇతర వాణిజ్య పంట లేవేసిన ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని దరువు ప్రాంతంగా ప్రకటించాల ని డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయం దెబ్బతిన్న ప్రజలు పట్టణాల్లో  వలసలు పోతున్నారని ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించాలని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం  కరువు ప్రాంతంగా ప్రకటించాల ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం  ఆదుకోవడానికి ఏం చర్యలు తీసుకుంతరని తెలపాల అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతుల పంటలను ఆదుకోవాల ని రాష్ట్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి నష్టపరిహారం కోసం సాయం అడగాలని, పత్రిక ప్రకటనల వరకు పరిమితం కాకుండా అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రం దగ్గరికి వెళ్లి తెలంగాణను అకోవాలని చెప్పి డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ కుటుంబ బీమా కార్యక్రమాన్ని ప్రారంభించారు గతంలో  రైతులకు భూమి ఉన్న వారికే బీమా ఉండేదని,వారు చనిపోతే వాళ్లకు ఐదు లక్షలు చొప్పున  భీమ ఉండేదని  ఇప్పుడు కుటుంబ బీమా అని  కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని  భార్య కూడా చనిపోతే  కుటుంబ భీమా అంటే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలో విద్యాసంస్థల అంత ఇంటర్మీడియట్ వరకు ఒకే దానికి ఎందుకు తీసుకురావాలి అంటే  స్కూల్లలోఇంటర్మీడియట్ ప్రారంభించేటప్పుడు అక్కడ ల్యాబ్స్ లు సౌకర్యాలు ఉన్నాయ బిల్డింగ్  సౌకర్యాలు ఉన్నాయా లేకుండానే ప్రభుత్వం ఎందుకు ప్రకటించిందన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, చిట్యాల సోమన్న, సుంచు విజేందర్, గంగాపురం మహేందర్, బిట్ల గణేష్, మండల కమిటీ సభ్యులు మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, మూసుకొని ఇంద్రారెడ్డి, సోమ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; సోమయ్య, పాలకుర్తి ,జనగామ జిల్లా