BREAKING
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కరువు సహాయక చర్యలు చేపట్టాలి అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు.

మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన

Select Suryaa Now
మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన

*మెగా హెల్త్ క్యాంప్‌పై గ్రామస్థులకు అవగాహన*

మల్లంపల్లి , మేజర్ న్యూస్, మల్లంపల్లి మండల కేంద్రంలోని ముదునూరుతండా గ్రామపంచాయతీ పరిధిలో ములుగు ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 28న గోవిందరావుపేటలోని పీఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించనున్న మెగా హెల్త్ క్యాంప్ వివరాలను గ్రామస్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంప్ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్‌ఐ చంద్రశేఖర్ సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 28న జరిగే మెగా హెల్త్ క్యాంప్‌కు గ్రామస్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

రిపోర్టర్ :రాజు, మల్లంపల్లి, ములుగు జిల్లా