పల్లె పల్లెకు మెపా
కొత్తగూడ, మేజర్ న్యూస్, రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ముదిరాజులు ఎదుర్కొంటున్న కోర్టు సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, చెరువులపై ముదిరాజులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించి, మత్స్యకార సహకార సంఘాల్లో ప్రభుత్వ సభ్యత్వాలు మంజూరు చేయాలని (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని కోరారు.మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం లోని వేలుబెల్లి గ్రామంలో మెపా కొత్తగూడ మండల అధ్యక్షులు అల్లాడి రాజు ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన పల్లె పల్లెకు మెపా కార్యక్రమంలో పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు.ముదిరాజులలో విద్యా చైతన్యం పెంపొందించి, ఉద్యోగ సాధికారత సాధించే దిశగా మెపా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మెపాలో భాగస్వాములై సంఘటితంగా ముందుకు సాగాలనిపిలుపునిచ్చారు.పల్లె పల్లెకు మెపా కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ముదిరాజులను చైతన్యవంతం చేస్తూ, వారి హక్కులు, సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వేలుబెల్లి గ్రామంలో పెండింగ్లో ఉన్న ముదిరాజుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వం ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ముదిరాజులు ఎదుర్కొంటున్న కోర్టు వివాదాలకు పరిష్కారం చూపడంతో పాటు, చెరువులపై వారి హక్కులను కాపాడి, అర్హులైన ముదిరాజులకు మత్స్యకార సంఘాల్లో సభ్యత్వాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మెపా కొత్తగూడ మండల అధ్యక్షులు అల్లాడి రాజు ముదిరాజ్, గ్రామ కుల పెద్ద మనిషి కాట లక్ష్మీనారాయణ, కొక్కు సదానందం, అశోక్, కాటా లచ్చయ్య, బొల్లెబోయిన వెంకటయ్య, ఉప్పలయ్య, మల్లయ్య, ఏకాంబరం, జట్టబోయిన నరేందర్, వరంగంటి సదానందం, చెన్నబోయిన యాకయ్య, పెండ్యాల రాజ్, కొక్కు నాగరాజు, కొక్కు దేవేందర్, కాట శ్రీనివాస్ ముదిరాజ్ తదితర గ్రామ కుల పెద్దలు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;వెంకన్న ,కొత్తగూడ, మహబూబాద్ జిల్లా