అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి
మల్హర్, మేజర్ న్యూస్, మండలంలోని కొయ్యూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన కాసర్ల అహల్యాదేవి దశదిన కర్మ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అహల్యాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రిపోర్టర్ :ప్రభాకర్ ,మలహర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా