BREAKING
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కరువు సహాయక చర్యలు చేపట్టాలి అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు.

అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా

Select Suryaa Now
అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా

వరంగల్ సిటీ , మేజర్ న్యూస్,  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ టి. వెంకన్న ఆదేశాల మేరకు బుధవారం జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో డివిజన్ నం.31 భట్టుపల్లి రోడ్డులోని ఏషియన్ పెయింట్స్ గోడౌన్ సమీపంలో ఉన్న అనధికార నిర్మాణాన్ని కూల్చివేశారు.ఈ కూల్చివేత కార్యక్రమాన్ని డీఆర్‌ఎఫ్ బృందం, పోలీసు సిబ్బంది సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ నస్రీన్ బాను, టీపీఎస్ ఖురేషి, సంబంధిత సిబ్బంది పాల్గొని చర్యలను పర్యవేక్షించారు.నగరంలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలు నిర్మాణాలు చేపట్టే ముందు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు పొందాలని సూచించారు.

రిపోర్టర్ ;సంతోష్, వరంగల్, సిటీ వరంగల్ జిల్లా