BREAKING
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కరువు సహాయక చర్యలు చేపట్టాలి అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

Select Suryaa Now
ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

కొడకండ్ల, మేజర్ న్యూస్, కొడకండ్ల మండల కేంద్రంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం ఎనిమిదో రోజు కొనసాగాయి. జేఏసీ కన్వీనర్ పొన్నం వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి మండల ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ మద్దతు తెలిపారు.ఈ దీక్షలకు మద్దతుగా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ సభ్యులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ కొడకండ్ల పాఠశాలలో 2002-2003లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అనువైన మూడు స్థలాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ఏదో ఒక చోట పాఠశాలను ఏర్పాటు చేయాలని దీక్షా శిబిరం నుంచి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని, వెనుకబడిన కొడకండ్ల మండలం విద్యాపరంగా, అభివృద్ధిపరంగా ముందుకు సాగేందుకు అవకాశం కలుగుతుందని నాయకులు, ఆందోళనకారులు అభిప్రాయపడ్డారు. కొడకండ్ల మండల కేంద్రంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

రిపోర్టర్ ;నవీన్ ,కొడకల్లా ,జనగామ జిల్లా