బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు
ఆత్మకూరు , మేజర్ న్యూస్, యూత్ కాంగ్రెస్ నాయకులను బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుదోవ పట్టించి బలవంతంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ కండువా వేస్తున్నారని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తనుగుల సందీప్ అన్నారు.మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రనికి చెందిన మొహమ్మద్ మోహిన్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు యూత్ కాంగ్రెస్ లో గత 10 సంవత్సరాల నుండి మోహిన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నడని అన్నారు.సోమవారం బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు యూత్ కాంగ్రెస్ నాయకుడు మోహిన్ని తప్పు దోవ పట్టించి బలవంతంగా బిఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆహ్వానించారాని తెలిపారు.స్వచ్చందంగా మొహమ్మద్ మోహిన్ మళ్ళీ పాత గూటికే రావడం జరిగిందని యూత్ కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని తెలిపారు.కాంగ్రెస్ నాయకులను తప్పు దోవ పట్టించి బలవంతంగా బిఆర్ఎస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించడంలో కేరఫ్ అడ్రస్ గా బిఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని అన్నారు. యూత్ కాంగ్రెస్ నుండి ఎ ఒక్క కార్యకర్త,నాయకులు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లలేదని బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసి యూత్ కాంగ్రెస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎరుకొండ రవీందర్ గౌడ్,పరికిరాల వాసు,బయ్యా కుమారస్వామి,ఆత్మకూరు గ్రామ అధ్యక్షుడు తాళ్ల కిరణ్,అలువాల రవి,గ్రామ యూత్ అధ్యక్షుడు ఎల్లబోయిన శ్రీశైలం,గుర్రం అజయ్,మాజీ యూత్ అధ్యక్షుడు కుక్కల రమేష్,సాయి రితీష్,కుక్కల మణికంఠ తదితరులు పాల్గొన్నారు..
రిపోర్టర్; శ్రీనివాస్, ఆత్మకూరు, హనుమకొండ జిల్లా