BREAKING
ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలి... - ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మత్స్య సహకార సంఘం నాయకులు పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి జమ్మూ కాశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదుల సంచారం.. షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తే అది అప్పగింత అభ్యర్థనకు వేరు:భారత్ స్పష్టీకరణ.. జర్మనీలో సహజ వాయువు నిల్వల పెంపునకు యూనిపర్ రూ. 1,100 కోట్ల పెట్టుబడి: ఎయిర్ ఇండియా–ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాల్లో భారీ మార్పులు: డాయిష్ బ్యాంక్–పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ఒప్పందం: జర్మనీ రక్షణ సంస్థ హెల్సింగ్ భారీ కొనుగోలుకు సిద్ధం: స్పెయిన్ రక్షణ సంస్థ ఇండ్రా భారీ లక్ష్యం.. 2030 నాటికి 12 బిలియన్ యూరోల ఆదాయం: అమెరికా, చైనాకు పోటీగా యూరప్ భారీ సాంకేతిక పెట్టుబడి నిధి : గూగుల్‌పై మలేషియా ప్రభుత్వం రూ. 1,300 కోట్ల దావా: నేటి రాశి ఫలాలు 26 నవంబర్, 2026 నేటి పంచాంగం26 నవంబర్, 2026

ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలి... - ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలి...  - ఆరుతడి పంటల సాగుపై రైతులకు  అవగాహన

 

సూర్య - పెద్దపల్లి రూరల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రాబోయే యాసంగి సీజన్‌లో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి డి. నాగార్జున రైతులకు సూచించారు. పెద్దపల్లి మండలంలోని సబితం, రంగాపూర్, రాఘవాపూర్, గౌరెడ్డిపేట, అందుగులపల్లి, దేవునిపల్లి గ్రామాల్లో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఏవో మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షపాతం తగ్గే అవకాశాలు, నీటి వనరులపై పడే ప్రభావాన్ని రైతులకుa వివరించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసుకునే ప్రొద్దుతిరుగుడు, శనగ, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.
అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, భూముల స్వభావం, నేల రకం, నీటి లభ్యత, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనువైన పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారి కె. సతీష్ కుమార్, సర్పంచులు నూనె సరోజన, గంట రమేష్, తాడిశెట్టి చామంతి, కొమ్ము సుజాత, బొక్కల రేఖ, ఉపసర్పంచులు ఇండ్ల మహేందర్, కొండ శ్రవణ్, కొడపత్రి వినోద్, పాలేటి వెంకటేష్, కడారి స్వప్న, వార్డు సభ్యులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.