BREAKING
హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం కంబదూర్ లో కూటమి విజయకేతనం కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం. కేజిబివి పి ఈ టీ విధుల నుంచి తొలగింపు.... ముదిగుబ్బ టిడిపి కైవసం నేడు గణాధిప సంకష్ట చతుర్థి.. శుభ ముహూర్తం..పూజా విధానం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయాలు ఇవే! ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ బాడంగి మండలంలో టీడీపీ హవా అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన.. మెటా స్మార్ట్ కళ్లద్దాల విక్రయాల నిలిపివేతకు డచ్ సంఘాల న్యాయపోరాటం: బ్రెజిల్ దిగ్గజ సంస్థ 'కాసన్' కీలక నిర్ణయం.. బ్రెజిల్ పెట్టుబడి సంస్థపై భారీ ఆర్థిక నేరాల దర్యాప్తు..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మత్స్య సహకార సంఘం నాయకులు

Select Suryaa Now
నూతన వధూవరులను ఆశీర్వదించిన మత్స్య సహకార సంఘం నాయకులు

సామాజిక బంధాలు ఐక్యతకు వివాహ వేడుకలు వేదికలు. మండల అధ్యక్షుడు గడ్డికోపుల  ఎల్లయ్య

నూతన వధూవరులను ఆశీర్వదించిన సంఘం నాయకులు

పెద్దకొత్తపల్లి, సూర్య న్యూస్: వివాహ వేడుకలు కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాకుండా, రెండు కుటుంబాల మధ్య అనుబంధాలను పెంపొందించే ఆత్మీయ వేడుకలని, ఇలాంటి శుభకార్యాలకు సంఘం నాయకులు, సభ్యులు హాజరుకావడం వల్ల పెళ్లి కుటుంబాలకు ఎంతో ఆనందం, గౌరవం కలుగుతుందని మత్స్యకార సంఘం నాయకులు పేర్కొన్నారు. మండల పరిధిలోని సంజీవపురం గ్రామంలో గువ్వల లక్ష్మి,చంద్రశేఖర్ దంపతుల వివాహ మహోత్సవానికి మత్స్యకార సంఘం నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెళ్లి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.సంఘంలోని నాయకులు, సభ్యులు శుభకార్యాలకు కలిసికట్టుగా హాజరుకావడం ద్వారా పరస్పర పరిచయాలు, స్నేహసంబంధాలు బలపడతాయని, సంఘ సభ్యులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. మన ఆత్మీయతను మాటలతోనే కాకుండా ఇలాంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా హాజరై చూపించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. సంఘం అండగా ఉందనే భరోసా పెళ్లి కుటుంబాలకు కలగడం ఆనందదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు, పెద్దకొత్తపల్లి మండల మత్స్యకార సంఘం అధ్యక్షుడు గడ్డికోపుల ఎల్లయ్య, సంజీవపురం మత్స్యకార సంఘం అధ్యక్షుడు భాష మౌని సైదులు, వెన్నచర్ల అధ్యక్షుడు గడ్డికోపుల నాగరాజు, చంద్రకల్ అధ్యక్షుడు పుట్ట స్వామి, గడ్డికోపుల శివప్రసాద్ తదితర సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.