BREAKING
ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ బాడంగి మండలంలో టీడీపీ హవా అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన.. మెటా స్మార్ట్ కళ్లద్దాల విక్రయాల నిలిపివేతకు డచ్ సంఘాల న్యాయపోరాటం: బ్రెజిల్ దిగ్గజ సంస్థ 'కాసన్' కీలక నిర్ణయం.. బ్రెజిల్ పెట్టుబడి సంస్థపై భారీ ఆర్థిక నేరాల దర్యాప్తు.. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అరుదైన ఖనిజాల పునర్వినియోగం.. అమెరికా సుంకాలతో స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థకు స్వల్ప ప్రభావమే.. ఇనుప ఖనిజ సంపదతో గినియా కొత్త ఆర్థిక నిధి.. కార్పొరేట్ బాండ్ల సూచీ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ ఆమోదం.. రష్యా మరో భారీ దాడికి సిద్ధం.. ఉక్రెయిన్ ఇంధన, రవాణా వ్యవస్థలే లక్ష్యమన్న జెలెన్‌స్కీ: సీఓపీ31లో కీలక ఒప్పందం విఫలం..

పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ

Select Suryaa Now
పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు  ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన  ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి  ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ

​పూతలపట్టు మేజర్ న్యూస్ :

పూతలపట్టు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన గుంటూరు మురళి చేపట్టిన ఎన్నికల ప్రచారం అత్యంత ఉత్సాహంగా, హోరాహోరీగా సాగుతోంది. గురువారం ఆయన నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మురళి వెంట నడుస్తూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఉదయం నుంచే పూతలపట్టులోని ప్రధాన వీధులు, వివిధ కాలనీలలో మురళి విస్తృతంగా పర్యటించారు మండల నాయకులు, గ్రామస్తులు కలిసి నినాదాలు చేస్తూ ముందుకు సాగడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇంటింటికీ వెళ్లిన మురళి, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ తన ఎన్నికల గుర్తు అయిన 'ఉంగరం' గుర్తుకు ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రచారం సాగిన ప్రతి చోటా స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు ప్రచారంలో భాగంగా ఓటర్లతో ముఖాముఖిలో గుంటూరు మురళి మాట్లాడుతూ "పూతలపట్టు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా ఏకైక లక్ష్యం. అధికారం కోసం కాకుండా, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలో నిలిచానని,గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి సమస్య, మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థ, అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను" అని స్పష్టం చేశారు ​అలాగే, గ్రామంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికీ మిస్ కాకుండా అర్హులైన ప్రతి గడపకూ చేరేలా బాధ్యత తీసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో సహకారం అందిస్తానని, మహిళా సంఘాల బలోపేతానికి, గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తానని హామీ ఇచ్చారు

​అందరివాడి గా మురళికి పెరుగుతున్న మద్దతు:

నిత్యం ప్రజల్లో ఉంటూ, గ్రామస్తుల కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తిగా గుంటూరు మురళికి గ్రామంలో మంచి పేరుంది ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకునే గుణం ఉండటంతో యువత, మహిళలు, వృద్ధులు ఆయనకు అండగా నిలుస్తున్నారు

​మురళి వెంట ప్రచారంలో పాల్గొన్న మండల నాయకులు, యువజన ప్రతినిధులు, మహిళలు సైతం ఓటర్లను అభ్యర్థిస్తూ.. గ్రామ అభివృద్ధి జరగాలంటే మురళి లాంటి సమర్థుడైన, సేవాభావం ఉన్న నాయకుడు సర్పంచ్‌గా గెలవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో బ్యాలెట్ పత్రంపై ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణ చూస్తుంటే మురళి విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.

పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్