BREAKING
ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ బాడంగి మండలంలో టీడీపీ హవా అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన.. మెటా స్మార్ట్ కళ్లద్దాల విక్రయాల నిలిపివేతకు డచ్ సంఘాల న్యాయపోరాటం: బ్రెజిల్ దిగ్గజ సంస్థ 'కాసన్' కీలక నిర్ణయం.. బ్రెజిల్ పెట్టుబడి సంస్థపై భారీ ఆర్థిక నేరాల దర్యాప్తు.. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అరుదైన ఖనిజాల పునర్వినియోగం.. అమెరికా సుంకాలతో స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థకు స్వల్ప ప్రభావమే.. ఇనుప ఖనిజ సంపదతో గినియా కొత్త ఆర్థిక నిధి.. కార్పొరేట్ బాండ్ల సూచీ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ ఆమోదం.. రష్యా మరో భారీ దాడికి సిద్ధం.. ఉక్రెయిన్ ఇంధన, రవాణా వ్యవస్థలే లక్ష్యమన్న జెలెన్‌స్కీ: సీఓపీ31లో కీలక ఒప్పందం విఫలం..

ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు

Select Suryaa Now
ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 కొంతమూరు గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎం.ఎం. నరేంద్రన్ గురువారం పరిశీలించారు. కొంతమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును, అధికారులు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో సిబ్బంది విధుల నిర్వహణ, ఓట్ల లెక్కింపు విధానం, ఫలితాల నమోదు తదితర అంశాలను పరిశీలించారు. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కౌంటింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆదేశించారు. ఈ సందర్భంగా డివిజనల్ అభివృద్ధి అధికారి పి. వీణాదేవి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె. సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, తహసిల్దార్ శ్రీనివాస్ ఎన్నికల వ్యయ పరిశీలకులకు కౌంటింగ్ ఏర్పాట్లను వివరించారు. సంబంధిత అధికారుల సమన్వయంతో సిబ్బందికి విధులు కేటాయించి, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.