BREAKING
బ్రిటన్ సాంకేతిక భద్రత: బ్యాంకులకు క్వాంటమ్ కంప్యూటింగ్ ముప్పుపై హెచ్చరిక.. వెటర్నరీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కీలక పాత్ర డీన్ డా.మాలకొండయ్య నేటి పంచాంగం27 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 27 నవంబర్, 2026 వగ్గంపల్లిలో కుమ్మిత భాగ్యలక్ష్మి విజయభేరి పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన!

వగ్గంపల్లిలో కుమ్మిత భాగ్యలక్ష్మి విజయభేరి

Select Suryaa Now
వగ్గంపల్లిలో కుమ్మిత భాగ్యలక్ష్మి విజయభేరి

-189 ఓట్ల మెజారిటీతో  విజయం బైరెడ్డి బాలిరెడ్డి కోడలికి ఓటర్ల బ్రహ్మరథం గెలుపు

- ధ్రువీకరణ పత్రం అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్య గోపాల్ 

పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని వగ్గంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కుమ్మిత భాగ్యలక్ష్మి ఘన విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బైరెడ్డి బాలిరెడ్డి కోడలిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకు గ్రామ ఓటర్లు విశేష ఆదరణ చూపారు. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 189 ఓట్ల మెజారిటీ సాధించి విజయాన్ని నమోదు చేశారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటించిన అధికారులు ఆమె విజయాన్ని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్య గోపాల్,కుమ్మిత భాగ్యలక్ష్మికి డిక్లరేషన్ ఫారం అందజేశారు.ఎన్నికల ప్రచార సమయంలో తనకు మద్దతుగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు భాగ్యలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఓటరుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వగ్గంపల్లి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.