BREAKING
ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి..

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026

Select Suryaa Now
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026

    విశాఖ ఎడ్యుకేషన్,  మేజర్ న్యూస్ : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని  గీతం స్కూల్ ఆఫ్ సైన్స్  భౌతిక శాస్త్ర విభాగం, ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ విశాఖపట్నం చాప్టర్,  ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ సంయుక్తంగా డిసెంబర్ 23, 24, 2026 తేదీలలో “సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 పేరుతో రెండు రోజుల విద్యా సదస్సును నిర్వహించనున్నాయని  గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డైరక్టర్ ప్రొఫెసర్ వై చందు కవిత తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో గురువారం  ఆమె  ఆవిష్కరించారు. 
   సింపుల్ ఫిజిక్స్ డెమోస్ ఫర్ ఆల్, రెప్లికబుల్ బై టీచర్స్ అన్వేషిక లెప్టాన్ అనే ఇతివృత్తంతో రూపొందించిన ఈ కాన్‌క్లేవ్, విద్యార్ధులు, అధ్యాపకులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విధానంలో భౌతిక శాస్త్రాన్ని బోధించే మరియు అర్ధం చేసుకునే వాస్తవిక విధానాన్ని అన్వేషించేలా ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని ఆమె తెలిపారు.  ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఐఐటి కాన్పూర్ విశ్రాంత ఆచార్యులు సుప్రసిద్ద “కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స” గ్రంధ రచయిత ప్రొఫెసర్ హెచ్.సి.వర్మ ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచి, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులతో ప్రత్యక్ష ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించనున్నారని వెల్లడించారు. ఈ రెండు రోజుల సదస్సులో భాగంగా డిసెంబర్ 23న ప్రకృతి ద్వారా భౌతిక శాస్త్రాన్ని నేర్చుకునే లెప్టాన్ (లెర్నింగ్ ఫిజిక్స్ త్రూ నేచర్) కార్యక్రమం మరియు ఆసక్తికరమైన ప్రత్యక్ష భౌతిక శాస్త్ర ప్రయోగాలతో కూడిన ది ఫిజిక్స్ షో  నిర్వహిస్తామని,  అనంతరం డిసెంబర్ 24న యంగ్ ఫిజిసిస్ట్స్ మీట్`కమ్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుందని తెలిపారు. ఈ కాన్‌క్లేవ్ కన్వీనర్‌గా గీతం భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రమేష్ సింగపల్లి, కో`కన్వీరర్లుగా ఐపిఎ విశాఖపట్నం చాప్టర్ కార్యదర్శి డాక్టర్ ఎ. చంద్రశేఖర్ మరియు ఐఏపిటి ఆర్‌సి 11 అధ్యక్షులు డాక్టర్ జోగ చంద్రశేఖర్ రావు, కోఆర్డినేటర్‌గా డాక్టర్ బి.స్పందన వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కాన్‌క్లేవ్‌లో పాల్గొనదలచిన వారు ముఖ్యంగా  విద్యార్ధులు మరియు భౌతిక శాస్త్ర అధ్యాపకులు ముందుగా  పేర్లు నమోదు చేసుకోవచ్చునని సూచించారు.