BREAKING
ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి..

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భీమిలి, మేజర్ న్యూస్: భీమిలి సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖకు వచ్చే ప్రాజెక్టుల్లో మూడో వంతు భీమిలి నియోజకవర్గంలోనే ఏర్పాటవుతున్నాయని ఉద్ఘాటించారు. 3, 4 వార్డుల్లో రూ. 2.25 కోట్ల విలువైన పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 వార్డు శ్మశాన వాటికల్లో రూ. 41 లక్షలతో తాగునీరు, విద్యుత్, టాయ్ లెట్ల నిర్మిస్తున్నామని, అలాగే 4 వార్డులో రూ. 1.83 కోట్లతో సెంట్రల్ మీడియన్ గ్రిల్స్, నేరెళ్ళవలస క్రిస్టియన్ శ్మశాన వాటికలో తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. 2014-19 మధ్యలో మంత్రిగా నియోజకవర్గంలో రికార్డు  స్థాయిలో రూ.4,300 కోట్ల విలువైన పనులు చేపట్టామని, ఈసారి అంతకుమించిన అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. రూ. 49 లక్షలతో ప్రతిపాదించిన గంట స్తంభం ఆధునికీకరణ పనులు మరో నెల రోజుల్లో పూర్తి కానున్నాయన్నారు. జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమార్, ఎస్.ఈ. శాంతిరాజు, కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, గరే సదానంద, పాసి సుస్మిత, ఇప్పాక వరలక్ష్మి, ఎంపీపీ యరబాల కృష్ణవేణి, కూటమి నాయకులు గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర, గరే గుర్నాథ్, సి.టి. శంకర్, దండి వెంకటేష్, కనకల అప్పలనాయుడు, చురకల రమణ, కె. రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.