టవర్ లైట్స్ కి శంకుస్థాపన
భీమిలి, మేజర్ న్యూస్: అభివృద్ధి లో భాగంగా 5 వ వార్డు పరిధిలో జీవీఎంసీ నిధులు తో 13 టవర్ లైట్స్ మంజూరు చేయడం జరిగింది. వార్డ్ పరిధిలో చొక్కవానిపాలెం లో వార్డ్ కార్పొరేటర్ శ్రీ గాయత్రి శంకర్ గారు,కూటమి నాయకులుతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి మొదటి లైటును ఏర్పాటు చేయించారు..అనంతరం వార్డ్ లో మిగిలిన ప్రాంతాలలో కూడా లైట్లను ఏర్పాటు చేయించారు..కార్యక్రమంలో 5 వ వార్డ్ ఇంచార్జ్ సి . టి శంకర్ గారితో పాటు తెలుగుదేశం నాయకులు గరికిన కింగ్,కారి అప్పారావు,మైలపల్లి రాము,చీపుళ్ళ శ్రీను,రవి,రాజేంద్ర ప్రసాద్,సీరపు రమణ జనసేన పార్టీ నాయకులు గరికిన అప్పారావు,స్టేట్ డైరెక్టర్ పిళ్లా బాలు,ఉమ్మిడి రాజు,నరేష్,ప్రసాద్,విజయ్
మరియు బీజేపీ నాయకులు ఊళ్ల కొండ,ధోని నాగరాజు కూటమి నాయకులు పాల్గొన్నారు