సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం
సూర్య - మానకొండూర్ : రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్‌కు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో గురువారం మానకొండూర్ మండలం సదాశివపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేస్తున్న కసిరెడ్డి రాణిరెడ్డి, ప్యానెల్ సభ్యులు గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేసి ఓటర్ల మద్దతు కోరారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శిగా పోటీ చేస్తున్న నరహరి లక్ష్మారెడ్డి, కోశాధికారిగా పోటీ చేస్తున్న ఎడమ జగన్ మోహన్ రెడ్డితో పాటు ప్యానెల్ సభ్యులు కూర మహిపాల్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, సంగీత రెడ్డి, గుడిపాటి రమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మర్రి రాజిరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.ప్రచారానికి మద్దతుగా ఉత్తర తెలంగాణ అధ్యక్షులు పెండ్యాల రాంరెడ్డి, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, కరీంనగర్ జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షులు ఏనుగు చుక్కారెడ్డి, సదాశివపల్లి గ్రామ రెడ్డి సంఘం సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.