ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం
ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం
మర్రిపాడు మేజర్ న్యూస్ :
మర్రిపాడు మండలం ఏపిలగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొడమేకల సంపూర్ణ గ్రామంలో ఆర్ కే బిల్డర్ అధినేత రసం రామకృష్ణారెడ్డి మరియు తమ మద్దతు దారులతో కలిసి గురువారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు మంచం గుర్తు కేటాయించడంతో ఇంటింటికి తిరుగుతూ మంచం గుర్తుకు ఓటు వేయమని కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంపూర్ణ మాట్లాడుతూ తమ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సమస్యలన్నీ పరిష్కరించేందుకు తమ మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. వీరి వెంట మాజీ సర్పంచులు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.