ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ
ఇంకొల్లు, మేజర్ న్యూస్:
ఇంకొల్లు మేజర్ పంచాయతీ సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ 2200 పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 20 వార్డులకు గాను 17 వార్డులకు తెదేపా మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. సర్పంచ్ గెలుపొందటంతో ఇంకొల్లు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు వలేరు మార్కు, ఇంకొల్లు సొసైటీ అధ్యక్షులు కరి శ్రీనివాసరావు, తదితర నాయకులు రఫీని శాలువాతో సత్కరించి, అభినందించారు. అనంతరం సంబరాలు చేసుకున్నారు.