BREAKING
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం

Select Suryaa Now
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : భారతదేశ పాల మనిషి, శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ (సీడీటీ)లో జాతీయ పాల దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (ఐడీఏ-ఏపీ) స్థానిక చాప్టర్, సీడీటీ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ వేడుకలను చేపట్టారు. ముందుగా డాక్టర్ కురియన్ చిత్రపటానికి ఐడీఏ, సీడీటీ అధికారులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలు, శ్వేత విప్లవ సాధనలో ఆయన చూపిన కీలక పాత్రను తెలియజేస్తూ రూపొందించిన సంక్షిప్త వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా గ్రామీణ పాల ఉత్పత్తిదారుల సాధికారతకు కురియన్ పాటుపడ్డారని, రైతుల ప్రయోజనాల కోసం జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ) స్థాపనకు నాయకత్వం వహించి దేశవ్యాప్తంగా సహకార పాడి వ్యవస్థను బలోపేతం చేశారని పేర్కొన్నారు. గ్రామీణ మహిళలను పాడి పరిశ్రమలో భాగస్వాములను చేసి వారికి ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం కల్పించిన ఆయన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. శ్రీమహిళా పాల ఉత్పత్తిదారుల కంపెనీ వంటి సంస్థలు కురియన్ దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి ఉత్తమ మహిళా పాడి రైతుగా ఎంపికైన అనంతపురం జిల్లా చామలపల్లెకు చెందిన టి.విద్యను వెటర్నరీ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ వి.వైకుంఠ రావు, శ్రీమహిళా పాల ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ ఎం.తిమ్మప్ప ఘనంగా సత్కరించారు. ఐడీఏ-ఏపీ లోకల్ చాప్టర్ తరఫున రూ.10,000 నగదు బహుమతి, సర్టిఫికెట్ అందజేశారు."స్వయం సహాయక సంఘాల నుంచి విజయవంతమైన పాల ఉత్పత్తి పారిశ్రామిక వేత్తలుగా గ్రామీణ మహిళల ప్రస్థానం" అనే అంశంపై ఎస్వీ వ్యవసాయ కళాశాల, వెటర్నరీ కళాశాల, డెయిరీ టెక్నాలజీ కళాశాల, హోం సైన్స్, ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతులు, పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఐడీఏ-ఏపీ స్టేట్ చాప్టర్ అధ్యక్షుడు రాజేంద్రబాబు, డెయిరీ టెక్నాలజీ అసోసియేట్ డీన్ డాక్టర్ డి.నాగేశ్వరరావు, డైరీ టెక్నాలజీ కళాశాల డీన్ డాక్టర్ జె గంగరాజు, ఐడీఏ-ఏపీ లోకల్ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ ముంజనాథ్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, సీడీటీ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, శ్రీమహిళా మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్