BREAKING
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం

Select Suryaa Now
రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : భారత రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకాలని భాష్యం జోనల్ ఇన్చార్జి లక్ష్మణ్ తెలిపారు. ధనలక్ష్మి నగర్‌లోని భాష్యం పాఠశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు భారత రాజ్యాంగం గురించి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అందించిన సేవలు, రాజ్యాంగంలోని గొప్పతనం, దాని ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులు, ముఖ్యమైన అధికరణలు (ఆర్టికల్స్) గురించి వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులందరితో భారత రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్