అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు
సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్
- అనంత రూరల్ లో 24 సర్పంచ్ స్థానాలకు 14 స్థానాలు వైకాపా మద్దతుదారుల గెలుపు
- 10 సర్పంచ్ స్థానాలలో కూటమి మద్దతుదారులు గెలుపు
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : సర్పంచ్ ఎన్నికలలో అనంతపురం రూరల్ మండలంలో అధికార కూటమికి గట్టి షాక్ తగిలింది. మెజార్టీ సర్పంచ్ స్థానాలను ప్రతిపక్ష వైకాపా మద్దతుదారులు గెలుపొందడంతో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను స్పష్టంగా కనిపించింది. అనంతపురం రూరల్ మండలంలో మొత్తం 24 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా ఇందులో 14 సర్పంచ్ స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుపొందగా, 10 సర్పంచ్ స్థానాలలో కూటమి మద్దతుదారులు గెలుపొందారు. అక్కంపల్లిలో- అంజన్ రెడ్డి (టిడిపి), ఆకుతోటపల్లి- జి. వెంకట రమణమ్మ (వైసిపి), ఆలమూరు- రామాంజి నమ్మ (టిడిపి), చియ్యేడు -ప్రశాంతి (వైసిపి) చిన్నంపల్లి లో టిడిపి మద్దతుదారులు (ఎం రామాంజనమ్మ , కొడిమి టీ అపర్ణ (జనసేన), కందుకూరు -సి. నాగమణి (సిపిఐ), కురుగుంట- మాధవరెడ్డి (వైసిపి), కామరూపల్లి నర్సింహులు (వైసిపి), కాటిగాని కాలువ (టిడిపి) కక్కలపల్లి (టిడిపి) కట్టకిందపల్లి -వై శ్రీనివాసులు (వైసిపి) ,కక్కలపల్లి కాలనీ రాధమ్మ ధనుంజయ యాదవ్ (వైసిపి), మనీలా ప్రశాంతి(టిడిపి) ,నరసనాయనకుంట -రాజు గోపాల్ నాయక్ (వైసిపి), రాచానుపల్లి-టి ఆంజనేయులు యాదవ్ (వైసిపి), ఉప్పరపల్లి- రామస్వామి (వైసిపి) ,పూలకుంట - ఎం గుండమ్మ (వైసిపి) ఇటుకులపల్లి -సుమతి (వైసిపి) ,సోములదొడ్డి-నాగార్జున రెడ్డి (వైసిపి) ,తాటిచెర్ల వై .చంద్రకళ (వైసిపి)లు గెలుపొందాయి. అనంత అర్బన్ పరిధిలో అనంతపురం రూరల్ హరిత (టిడిపి), రాజీవ్ కాలనీ- ఏ హరి (టిడిపి) రుద్రంపేట పంచాయతీ(ఏం హరి ప్రసాద్) టిడిపి మద్దతుదారులు గెలుపొందారు.