బాడంగి మండలంలో టీడీపీ హవా
25 పంచాయతీలకు ఎన్నికలు.. 18 చోట్ల టీడీపీ, 6 చోట్ల వైకాపా విజయం
బాడంగి, నవంబరు 26 (మేజర్ న్యూస్): బాడంగి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఆధిక్యం సాధించారు. మండలంలోని మొత్తం 25 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు 18 చోట్ల, వైకాపా మద్దతుదారులు 6 చోట్ల విజయం సాధించగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో మండలంలో టీడీపీ మద్దతుదారులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు.
విజేతల వివరాలు ఇలా..
బాడంగి – దేవరపల్లి రాజేశ్వరి, ఆకులకట్ట – వుయ్యాల సత్యనారాయణ, బొత్తవానివలస – బొత్సత్రినాధనాయుడు, గజరాయునివలస – ఎన్. సావిత్రి, పెదపల్లి – ఆవు పోలమ్మ, పిండ్రంగివలస – దత్తి పార్వతి, పి. వెంకంపేట – వాసిరెడ్డి గణపతి, మల్లంపేట – చింతాడ రమేష్, గూడేపువలస – వంగపండు అనురాధ, పాల్తేరు – పి. సత్యనారాయణ, గొల్లాది – పామోటి సత్యనారాయణ, వాడాడ – ఎ. అచ్చుతరావు, పూడివలస – పూడి పద్మావతి, తెంటుపలస – కొల్లి సూర్యకాంతం(ఏకగ్రీవం), ముగడ – గొర్లె మౌనిక(ఏకగ్రీవం),, డొంకినవలస – వసంతుల సూర్యనారాయణ(ఏకగ్రీవం), రేజేరు – బొమ్మి గౌరమ్మ(ఏకగ్రీవం), పిన్నవలస – తెంటు రమాదేవి(ఏకగ్రీవం)టీడీపీ మద్దతుదారులుగా విజయం సాధించారు.
వీరసాగరం – డి. సింహాచలం, భీమవరం – లచుపతుల దాలినాయుడు, పినపెంకి – చొక్కాపు నాగభూషణం, కోటిపల్లి – కండి రవణమ్మ, ఆనవరం – చింత ప్రమీల, కోడూరు – రెడ్డి కృష్ణమూర్తి వైకాపా మద్దతుదారులుగా గెలుపొందారు.
లక్ష్మీపురం పంచాయతీలో చీకటి సింహాచలం స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు.
మండలంలోని గ్రామ పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను దక్కించుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పలుచోట్ల విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.