ముదిగుబ్బ టిడిపి కైవసం
మేజర్ పంచాయతీ ముదిగుబ్బ తెలుగుదేశం పార్టీ మద్దతుతారు మల్లెల నారాయణస్వామి 153 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్ ఆధ్వర్యంలో ఎన్నికల బరిలో నిలిచిన మల్లెల నారాయణస్వామి అత్యంత ఉత్కంఠ భరిత గా సాగిన పోటీలలో 153 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. తీవ్ర ఉత్కంఠత మధ్య రాత్రి 10 గంటల పైన ఎన్నికల అధికారులు ఈ ఫలితాన్ని ప్రకటించడం జరిగింది. సర్పంచ్ గా ఎన్నికైన మల్లెల నారాయణస్వామిని పలువు ఈ సందర్భంగా అభినందించారు.