BREAKING
హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం కంబదూర్ లో కూటమి విజయకేతనం కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం. కేజిబివి పి ఈ టీ విధుల నుంచి తొలగింపు.... ముదిగుబ్బ టిడిపి కైవసం నేడు గణాధిప సంకష్ట చతుర్థి.. శుభ ముహూర్తం..పూజా విధానం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయాలు ఇవే! ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ బాడంగి మండలంలో టీడీపీ హవా25 పంచాయతీలకు ఎన్నికలు.. 18 చోట్ల టీడీపీ, 6 చోట్ల వైకాపా విజయం అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన.. మెటా స్మార్ట్ కళ్లద్దాల విక్రయాల నిలిపివేతకు డచ్ సంఘాల న్యాయపోరాటం: బ్రెజిల్ దిగ్గజ సంస్థ 'కాసన్' కీలక నిర్ణయం.. బ్రెజిల్ పెట్టుబడి సంస్థపై భారీ ఆర్థిక నేరాల దర్యాప్తు..

కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం.

Select Suryaa Now
కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం.

కళ్యాణదుర్గం: మండల పరిధిలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు. మొత్తం 17 గ్రామ పంచాయతీలకు గాను 11 పంచాయతీల్లో విజయం సాధించి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఐదు పంచాయతీలను కైవసం చేసుకోగా, మరో పంచాయతీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే భట్టువానిపల్లిలో వైసీపీ అభ్యర్థి 182 ఓట్ల మెజారిటీతో, బోరంపల్లిలో 28 ఓట్లతో, దురదకుంటలో 186 ఓట్లతో, గరుడాపురంలో 351 ఓట్లతో, హులికల్లులో 103 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు బ్యాడ్రహళ్లిలో 312 ఓట్లు, చాపిరిలో 270 ఓట్లు, ఈస్ట్ కోడిపల్లిలో 275 ఓట్లు, గోళ్లలో 352 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎం. కొత్తూరులో 607 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించగా, ఎం. కొండాపురంలో 403 ఓట్లు, మానిరేవులో 33 ఓట్లు, నారాయణపురంలో 250 ఓట్లు, పాలవాయిలో 36 ఓట్లు, పీటీఆర్ పల్లి తండాలో 60 ఓట్లు, తిమ్మసముద్రంలో 76 ఓట్ల మెజారిటీతో టీడీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగురవేశారు. ముద్దినాయనపల్లిలోనూ టీడీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. మొత్తంగా మండలంలోని 17 పంచాయతీల్లో టీడీపీ 11 స్థానాలు, వైసీపీ ఐదు స్థానాలు కైవసం చేసుకున్నాయి. మరో పంచాయతీ ఫలితంపై స్పష్టత రావాల్సి ఉంది. అత్యధిక పంచాయతీలను దక్కించుకోవడంతో టీడీపీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది. గెలుపొందిన అభ్యర్థులకు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.