BREAKING
హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం కంబదూర్ లో కూటమి విజయకేతనం కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం. కేజిబివి పి ఈ టీ విధుల నుంచి తొలగింపు.... ముదిగుబ్బ టిడిపి కైవసం నేడు గణాధిప సంకష్ట చతుర్థి.. శుభ ముహూర్తం..పూజా విధానం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయాలు ఇవే! ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ బాడంగి మండలంలో టీడీపీ హవా25 పంచాయతీలకు ఎన్నికలు.. 18 చోట్ల టీడీపీ, 6 చోట్ల వైకాపా విజయం అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన.. మెటా స్మార్ట్ కళ్లద్దాల విక్రయాల నిలిపివేతకు డచ్ సంఘాల న్యాయపోరాటం: బ్రెజిల్ దిగ్గజ సంస్థ 'కాసన్' కీలక నిర్ణయం.. బ్రెజిల్ పెట్టుబడి సంస్థపై భారీ ఆర్థిక నేరాల దర్యాప్తు..

కంబదూర్ లో కూటమి విజయకేతనం

Select Suryaa Now
కంబదూర్ లో కూటమి విజయకేతనం

కంబదూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంబదూరులో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గంగాదేవి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కిరణ్‌పై 842 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాల్లో గంగాదేవి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గ్రామంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు గంగాదేవికి విశేష మద్దతు ప్రకటించి సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ప్రత్యర్థిపై భారీ మెజారిటీ సాధించడం కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఫలితాలు వెలువడిన వెంటనే కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గంగాదేవికి పూలమాలలు వేసి ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. తన విజయానికి సహకరించిన కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలందరికీ గంగాదేవి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. 842 ఓట్ల భారీ మెజారిటీతో సాధించిన ఈ విజయం కంబదూరులో కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.