BREAKING
ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా! గుడిసి బండ సర్పంచ్ అభ్యర్థి మా రెడ్డి గారి హరి కిషన్ రెడ్డి వికలాంగ ఓటరికి సహాయం.. పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించిన పోలీసులు రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి గ్రామీణ చైతన్యానికి ఆహార సాంకేతిక విజ్ఞానం.. కన్హాలో విద్యార్థులతో నిఫ్టెమ్-కుండ్లి అవగాహన కార్యక్రమం! ప్రారంభమైన గ్రామపంచాయతీ ఎన్నికలు మహిళా హింస నిర్మూలన దినోత్సవం ఘనంగా సాగర కమలం.... (కథ) మంచు కొండల్లో దేశభక్తి.. సియాచిన్ పోర్టర్ల త్యాగగాథ గోళ్ల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పిటిసి సర్పంచ్ అభ్యర్థి. కర్రోతు ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్ కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో విద్యుత్ అంతరాయం. ఓటర్లకు తప్పని ఇబ్బందులు గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో భారీగా మోహరించిన పోలీసు పథకాలు. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలి... - ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మత్స్య సహకార సంఘం నాయకులు

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

Select Suryaa Now
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : గార్లదిన్నె–కల్లూరు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. నవంబర్ 25వ తేదీ సాయంత్రం 5.15 గంటలలోపు కేఎం నంబర్ 232/41 వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, గుర్తుతెలియని రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

మృతుడు తెలుపు, కాఫీ రంగు చెక్స్ ఫుల్‌షర్ట్, గ్రే కలర్ ప్యాంటు, నీలం రంగు కట్ డ్రాయర్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే మృతుడి పేరు, ఊరు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే అనంతపురం రైల్వే పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆర్‌పీహెచ్‌సీ విజయ్ కుమార్‌ను 7989584613 నంబర్‌లో సంప్రదించి వివరాలు తెలియజేయాలని రైల్వే పోలీసులు కోరారు.