కర్రోతు ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్
* భూమాత లేఔట్‌లో సందడిగా కర్రోతు బంగార్రాజు తనయుడి వివాహం
* నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వాదం
* మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన ఐటీ మంత్రి
భోగాపుర, (మేజర్ న్యూస్): మండలంలోని పోలిపల్లి గ్రామ సమీపాన ఉన్న భూమాత లేఔట్‌లో బుధవారం జరిగిన ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు కుమారుడు శేఖర్ వివాహ వేడుకకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని ఆశీర్వదించి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. మంత్రి లోకేశ్ రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. ఆయన వెంట పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్: వై శ్రీనివాస్, భోగాపురం.