గ్రామీణ చైతన్యానికి ఆహార సాంకేతిక విజ్ఞానం.. కన్హాలో విద్యార్థులతో నిఫ్టెమ్-కుండ్లి అవగాహన కార్యక్రమం!
గ్రామీణ చైతన్యానికి ఆహార సాంకేతిక విజ్ఞానం.. కన్హాలో విద్యార్థులతో నిఫ్టెమ్-కుండ్లి అవగాహన కార్యక్రమం!
ఆహార భద్రత, లేబులింగ్, ఫుడ్ టెక్నాలజీ, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలపై అవగాహన
కన్హా (రంగారెడ్డి): ఆహార సాంకేతిక విజ్ఞానాన్ని తరగతి గదులకే పరిమితం చేయకుండా సమాజానికి చేరువ చేస్తూ, గ్రామీణ అభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిఫ్టెమ్-కుండ్లి (NIFTEM-Kundli) చేపట్టిన ప్రతిష్ఠాత్మక గ్రామ దత్తత కార్యక్రమం (Village Adoption Programme – VAP)లో భాగంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ (CBSE క్యాంపస్), కన్హాలో విద్యార్థులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమైన నిఫ్టెమ్-కుండ్లి బృందం ఆహార భద్రత (Food Safety), ఆహార లభ్యత–పోషకాహార ప్రాముఖ్యత (Food Security), ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల లేబులింగ్‌పై అవగాహన కల్పించింది. ప్యాకేజ్డ్ ఆహారాన్ని కొనుగోలు చేసే ముందు లేబుల్‌పై ఉన్న సమాచారం, తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల వివరాలు, ఇతర కీలక అంశాలను పరిశీలించడం ఎందుకు అవసరమో విద్యార్థులకు వివరించారు. ఆహార సాంకేతిక రంగం అందిస్తున్న అవకాశాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, ఆవిష్కరణలు, స్వయం ఉపాధి, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలపై కూడా వారితో చర్చించి ప్రోత్సహించారు.
భారత ప్రభుత్వ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoFPI) ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిఫ్టెమ్-కుండ్లి చేపట్టిన గ్రామ దత్తత కార్యక్రమం 2012 నుంచి అమలవుతున్న వినూత్న విద్యా–సామాజిక కార్యక్రమం. విద్యార్థులకు గ్రామీణ భారత పరిస్థితులు, రైతుల సమస్యలు, స్థానిక వనరులు, వ్యవసాయ–ఆహార సరఫరా వ్యవస్థలపై క్షేత్రస్థాయి అవగాహన కల్పించడం, గ్రామీణ సమాజానికి ఆహార ప్రాసెసింగ్, సాంకేతిక పరిజ్ఞానం, విలువ జోడింపు, వ్యాపార అవకాశాలను చేరవేయడం దీని ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు, విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యవస్థాపక ఆలోచ