BREAKING
సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి బెస్తరపల్లిలో గడ్డివాని దగ్ధం.. 5 లక్షల వరకు ఆస్తి నష్టం. 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు భారత్ బయో ఎకానమీ నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు భారత్ 2.5 మిలియన్ డాలర్ల సాయం లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా శ్రీలంక పార్లమెంట్ నేపాల్ వరదల్లో గల్లంతైన 213 మంది భారతీయుల మరణ ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం ఏరో ఇండియా 2027కు రికార్డు స్థాయిలో స్పందన ఎంఎస్ఎంఈ నమోదులలో 10 కోట్ల మైలురాయి ఆటోమొబైల్ రంగం పీఎల్ఐ పథకం కింద రూ.4,385 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు ఎస్ఐ.. యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! అధికారులతో కలిసి ఆర్ యుబీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి

ఏరో ఇండియా 2027కు రికార్డు స్థాయిలో స్పందన

Select Suryaa Now
ఏరో ఇండియా 2027కు రికార్డు స్థాయిలో స్పందన

సూర్య జాతీయ డెస్క్: ఎరో ఇండియా 2027 ప్రదర్శనకు దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఊహించని స్థాయిలో డిమాండ్ పెరగడంతో రక్షణ మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి సారించింది. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ వేదికగా నిలిచిన ఏరో ఇండియా 16వ ఎడిషన్ ఫిబ్రవరి 8 నుంచి 12, 2027 వరకు బెంగళూరులోని యలహంక వైమానిక దళ స్టేషన్‌లో జరగనుంది. ప్రదర్శన స్థలం కోసం వచ్చిన అభ్యర్థనలు తొలుత అంచనా వేసిన సామర్థ్యం కంటే సుమారు 12,000 చదరపు మీటర్ల మేర అదనంగా పెరిగాయని రక్షణ ఉత్పత్తి విభాగం వెల్లడించింది.

భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ తయారీ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ప్రాధాన్యతకు ఈ భారీ డిమాండ్ నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. యలహంక చురుకైన వైమానిక దళ శిక్షణ కేంద్రం కావడం వల్ల భద్రతా నిబంధనల దృష్ట్యా భూమిపై విస్తరణకు పరిమితులు ఉన్నప్పటికీ, పెరిగిన అవసరాలను తీర్చేందుకు కీలక ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. సంస్థల భాగస్వామ్యానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అదనపు స్థల అవసరాలను తీర్చడానికి రక్షణ ఉత్పత్తి విభాగం రెండు ప్రధాన మౌలిక సదుపాయాల చర్యలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు కొత్త ఎగ్జిబిషన్ హ్యాంగర్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటితో పాటు కేటాయించిన ప్రదర్శన స్టాళ్ల లోపల మెజనీన్ ఫ్లోర్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రవేశపెట్టారు.

ప్రపంచ రక్షణ పరిశ్రమలో భారతదేశం తన పాత్రను విస్తరించుకుంటున్న తరుణంలో ఈ ఏర్పాట్లు కీలకంగా మారాయి. స్వదేశీ తయారీ సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకునేందుకు రాబోయే ఎరో ఇండియా 2027 వేదిక మరింత విస్తృతంగా ఉపయోగపడనుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.