BREAKING
ఎంఎస్ఎంఈ నమోదులలో 10 కోట్ల మైలురాయి ఆటోమొబైల్ రంగం పీఎల్ఐ పథకం కింద రూ.4,385 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు ఎస్ఐ.. యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! అధికారులతో కలిసి ఆర్ యుబీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట అంగన్వాడి రిక్రూట్మెంట్ సంబంధించి అభ్యంతరాలు స్వీకరణ చేయడం జరిగింది. వైభ‌వంగా హైద‌రాబాద్ ఒడిస్సీ నృత్యోత్స‌వం బాధితుడికి,మాజీ కార్పొరేటర్ మురుగేష్ పరామర్శ రూ 5000 ఆర్థిక సహాయం అందజేత రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.. నషాముక్త్‌ భారత్‌ పాదయాత్రకు బీజేపీ నాయకుల సంఘీభావం జాతీయ దగ్గు దినోత్సవ ప్రచారం ద్వారా గిన్నిస్ రికార్డు బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ

Select Suryaa Now
యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ

 

హైదరాబాద్, 25 నవంబర్ 2026: అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, క్రియేటివ్ కమ్యూనికేషన్స్ రంగాలలో ఉన్న సృజనాత్మక ప్రతిభను సత్కరించేందుకు యాడ్ ట్రైబ్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 'యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’ పేరుతో నిర్వహించనున్న వేడుకకు క్యాప్‌స్టన్ ప్రధాన భాగస్వామిగా, హార్మొనీ, స్టూడెంట్ ట్రైబ్ అసోసియేట్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీలు, బ్రాండ్లు, సృజనాత్మక నిపుణులకు 54 కేటగిరీలలో పురస్కారాలు అందించనున్నారు. ఈ అవార్డులకు డిసెంబర్ 15వ తేదీ వరకు ఎంట్రీలు స్వీకరించనున్నారు. జనవరి 29వ తేదీన మాదాపూర్‌లోని డీ కన్వెన్షన్, హోటల్ దసపల్లా వేదికగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా క్యాప్‌స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కార్తీక్ కొడాలి మాట్లాడుతూ వినియోగదారులలో మారుతున్న ప్రవర్తన, సాంకేతికత, సరికొత్త ఆలోచనా విధానాలకు అనుగుణంగా అడ్వర్టైజింగ్ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ అవార్డుల ప్రారంభ ఎడిషన్‌తో మమేకం కావడం, అడ్వర్టైజింగ్ భవిష్యత్తును తీర్చిదిద్దే చర్చలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

 

ఈ సందర్భంగా యాడ్ ట్రైబ్ వ్యవస్థాపకులు వెంకట్ రెడ్డి మర్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అద్భుతమైన అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ వ్యవస్థ ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీలు, బ్రాండ్లు విస్తృత గుర్తింపుకు అర్హత గల పనిని చేస్తున్నాయన్నారు. ఈ ప్రతిభను వేడుకగా జరుపుకోవడానికి, పరిశ్రమను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఒక విశ్వసనీయమైన వేదికను సృష్టించడమే 'యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్' లక్ష్యమన్నారు. ఈ అవార్డుల వేడుకను క్యాప్‌స్టన్, హార్మొనీ, స్టూడెంట్ ట్రైబ్ తో కలిసి చేస్తున్నామన్నారు. పరిశ్రమకు సృజనాత్మకత, ఆవిష్కరణలు, అర్థవంతమైన సహకారాన్ని అందించే వారిని గుర్తించే ఈ అవార్డుల వేదికను నిర్మించే మా ప్రయత్నాలకు వీరి మద్దతు మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు.

 

దక్షిణ భారతదేశంలో అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, క్రియేటివ్ కమ్యూనికేషన్ రంగాలలో సాధించిన అత్యుత్తమ విజయాలను గుర్తించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యం. ఏజెన్సీ అవార్డులు, బ్రాండ్ అవార్డులు, వర్క్ & క్యాంపెయిన్ అవార్డుల విభాగాలలో 54 కేటగిరీలతో నిర్వహించబడుతున్న ఈ వేడుక ఈ ప్రాంతంలోని ప్రముఖ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, బ్రాండ్లు, మార్కెటింగ్ నిపుణులు, సృజనాత్మక ప్రతిభావంతులందరినీ ఒకే వేదికపైకి తీసుకురానుంది. క్యాప్‌స్టన్ గ్రూప్‌లో భాగమైన క్యాప్‌స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సృజనాత్మకత, ఆవిష్కరణలు, వృత్తిపరమైన నైపుణ్యాన్ని గుర్తించే ఈ కార్యక్రమం లక్ష్యానికి మద్దతు ఇస్తుంది.