telangana
బాధితుడికి,మాజీ కార్పొరేటర్ మురుగేష్ పరామర్శ రూ 5000 ఆర్థిక సహాయం అందజేత
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: గౌతంనగర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ కాలికి, తీవ్ర గాయమై ఇంట్లోనే చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ ఏకే. మురుగేష్ బుధవారం బాధితుడి నివాసానికి వెళ్ళి, ఆయనను పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స తీసుకోవాలని సూచించారు. వెంటనే బాధితుని గురించి మల్కాజిగిరి మాజీ ఎమ్మె ల్యే మైనంపల్లి హన్మంతరావుకు సమాచారం అందజేశారు. మైనంపల్లి హన్మం తరావు ఆదేశాలతో మురుగేష్ తన స్వంతంగా, బాధితుడు నరేష్ కు రూ 5000 ల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. బాధితుడు త్వరగా కోలుకుని ప్రజలకు తన సేవలందిం చాలని ఆయన ఆకాంక్షించారు. పేదల పెన్నిధి మైనంపల్లి అన్నతో పాటుగా తాము అందరం కష్టాలలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్య కర్తకు, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటా మని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి కృష్ణగౌడ్, మొహ్మద్ ఫరీద్, శ్రీనివాస్ చారి,శంకర్, లక్ష్మి, గ్యార ప్రవీణ్, రాజేష్, సుదర్శన్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు