రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి..
నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జనరల్ ఆసుపత్రికి తరలించి తన ఉదారతను చాటుకున్నారు. తాడూరు మండలంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో, అయ్యప్ప స్వామి ఆలయం ఎదుట రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనను గమనించిన ఎమ్మెల్యే వెంటనే తన కారును ఆపి క్షతగాత్రుల వద్దకు చేరుకుని వారికి సహాయం అందించారు. క్షణం ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తించడమే కాకుండా, ఆపదలో ఉన్నవారికి మానవతా దృక్పథంతో అండగా నిలిచారు..
---