telangana
2027 పర్యాటక గమ్యస్థానంగా భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్: ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా 2027 సంవత్సరానికి భారతదేశం ఎంపిక కావడం దేశ పర్యాటక రంగాభివృద్ధికి సువర్ణావకాశమని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఏఐ) పేర్కొంది. ఈ గుర్తింపుతో అంతర్జాతీయ పర్యాటకుల దృష్టి భారత్‌పై మరింతగా కేంద్రీకృతమవుతుందని, విదేశీ పర్యాటకుల రాక పెరిగేందుకు దోహదపడుతుందని వెల్లడించింది. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో సుస్థిర పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని తెలిపింది. దేశంలోని ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైవిధ్యం, చారిత్రక వారసత్వం, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆరోగ్య, వైద్య పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడింది.
ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రత్యేక స్థానం- హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, రాడిసన్ హోటల్ గ్రూప్ దక్షిణాసియా చైర్మన్ కె.బి. కచ్రు మాట్లాడుతూ, ఈ గుర్తింపు భారతదేశానికి గొప్ప విజయమని పేర్కొన్నారు. దేశ సాంస్కృతిక, వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, పర్యాటక పరిశ్రమ భాగస్వాములను అభినందించారు. దేశ పర్యాటక రంగంలోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.