telangana
నషాముక్త్ భారత్ పాదయాత్రకు బీజేపీ నాయకుల సంఘీభావం
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల ‘నషాముక్త్ భారత్’ మహా పాదయాత్రకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర బుధవారం అంబర్‌పేట మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్రకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ సీనియర్ నాయకులు పులి రామ్‌మోహన్, బరిగెల జ్ఞానేశ్వర్, బడుగు సతీష్ తదితరులు పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.