BREAKING
జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు – సాయంత్రంలోగా ఫలితాల వెల్లడికి చర్యలు భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపీ వద్దిరాజు తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు* ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలి గైర్హాజరైతే క్రమశిక్షణా చర్యలు తప్పవు – కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్) అక్కంపల్లిలో కూటమి మద్దతుదారుడు అంజన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ మేయర్ జె బి శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడానికి చేరా... దివాలా పునర్వ్యవస్థీకరణలో ఎయిర్‌బాల్టిక్.. దూబగుంట పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది -అంబేద్కర్ లా కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం కాంగోలో ఎబోలా మహమ్మారి తీవ్రరూపం.. 12 వేలకుపైగా కేసులు, 5,904 మంది మృతి: హెల్తీ విలేజ్ ఫుడ్ వింగర్ బీన్స్..! -దక్షిణాసియాలో లభించే మొక్క..!! -ప్రస్తుతం పెద్దచెరుకూరులో సాగు..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్) అమెరికా సహకారంతో కెన్యాలో నిర్మిస్తున్న ఎబోలా నిర్బంధ కేంద్రానికి న్యాయస్థానం అడ్డుకట్ట: చైనా కృత్రిమ మేధ సంస్థ 'మినీమ్యాక్స్'పై డేటా భద్రతా ఆందోళనలు.. సోషల్ మీడియాలో పోస్టుల నియంత్రణ.. మెటాపై ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్.. సీఎం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ విజయ మునిశేఖర్ రాయల్

సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి

Select Suryaa Now
సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి

మేడ్చల్, మేజర్ న్యూస్: ఎండల ప్రభావంతో నీటి సరఫరా తగ్గి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొంగళ్ల మల్లారెడ్డి తన వంతు సహకారం అందించారు. గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ బోరుకు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు.ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో గ్రామాల్లో నీటి సరఫరా తగ్గి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పూడూరు గ్రామంలోని రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ యాదగిరి ఇంటి వద్ద ఉన్న పాత ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావడం గ్రామస్తులకు ఊరటనిచ్చింది. ప్రజల మంచినీటి అవసరాలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి బోరును పునరుద్ధరించిన గొంగళ్ల మల్లారెడ్డిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి, ప్రజల అవసరాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని గొంగళ్ల మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవక మహేష్ తదితరులు పాల్గొన్నారు.