మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం
రామాయంపేట;మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, స్వయం ఉపాధి ద్వారా తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ శిక్షణ ద్వారా మహిళల్లో నైపుణ్యాన్ని పెంపొందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని నిర్వాహకులు భావిస్తున్నారు.రామాయంపేటలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు సహకారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణలో ఆసక్తి ఉన్న మహిళల నుంచి గురువారం దరఖాస్తులు స్వీకరించారు.మగ్గం వర్క్‌పై శిక్షణ పొందిన మహిళలు భవిష్యత్తులో సొంతంగా ఉపాధి అవకాశాలు కల్పించుకోవడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.