అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి
- మంత్రి సుభాష్
కాజులూరు, మేజర్ న్యూస్ : భారత రాజ్యాంగమే మన ప్రజాస్వామ్యానికి దిక్సూచి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారతపై ఆయన చూపిన దూరదృష్టి దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ప్రతి పౌరుడు తమ హక్కులతో పాటు విధులను కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.