BREAKING
రాజ్యాంగ విలువలే దేశాభివృద్ధికి పునాది -డెయిరీ టెక్నాలజీ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం కొణికి సర్పంచ్‌గా చంద్రశేఖర్‌ అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి మద్దతుదారులను గెలిపించండి సాంప్రదాయ కళల ప్రోత్సాహంతో సమాజ శ్రేయస్సు -శంకర విజయేంద్ర సరస్వతి స్వామీ ఉద్ఘాటన ఎన్నికల నిబంధనలకు లోబడి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు అడ్డతీగల సర్పంచ్ గా బీర వెంకటలక్ష్మి ఉత్కంఠ భరితంగా ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు -బాలికల వాలీబాల్‌లో పలమనేరు చాంపియన్ -రెండో రోజూ హోరాహోరీ తలపడ్డ క్రీడాకారులు అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి

ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ

Select Suryaa Now
ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ

- రాచపల్లిలో భారీ చేరికలు
- ఏనుగు శ్రీను యూత్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన 15 కుటుంబాలు

​ప్రత్తిపాడు మేజర్ న్యూస్ :

ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతోంది. మండలంలోని రాచపల్లి గ్రామంలో గురువారం భారీ ఎత్తున చేరికల కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఏనుగు శ్రీను యూత్ ఆధ్వర్యంలో సుమారు 15 కుటుంబాలు పలు పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
​నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ముద్రగడ్డ గిరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, పార్టీలోకి నూతనంగా చేరిన కుటుంబ సభ్యులకు ఆయన వైసీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వారంతా వైసీపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా గిరిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.