అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి
- ఎంపిడిఓ నరేంద్రరెడ్డి
పెదపూడి మేజర్ న్యూస్ :
మండలంలోని గ్రామపంచాయితీలకు జరగబోవు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి 18 గ్రామాలకు దోమాడ, పెదపూడి, కుమారప్రియం, గొల్లల మామిడాడ, వేండ్ర మొత్తము 5 గ్రామపంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయని, అధికారులు మిగిలిన గ్రామాల ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎంపిడిఓ కొవ్వూరి నరేంద్రరెడ్డి అన్నారు. పెదపూడి ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఎంపిడిఓ నరేంద్ర రెడ్డి పిఓ, బిఎల్ఓ లకు శిక్షణా తరగతులు నిర్వహించారు.మండలంలొని 5 పంచాయతీలు ఏకగ్రీవం కాగా
మిగిలిన గ్రామాలలో పుట్టకొండ 10 వార్డులకు 10 వార్డులు,గండ్రేడు 12 వార్డులకు 3 వార్డులు, కైకవోలు 10 వార్డులకు 3 వార్డులు, కాండ్రేగుల 10 వార్డులకు ఒక వార్డు, కరకుదురు 14 వార్డులకు 10 వార్డులు, పైన 10 వార్డులకు 6 వార్డులు, శహపురం 12 వార్డులకు ఒక వార్డు ఏకగ్రీవం అయియున్నవి.
రాజుపాలెం 5వ వార్డు నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నందున సదరు వార్డుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఎన్నికలు నిర్వహించబడునని, ఏకగ్రీవం కాని గ్రామములలో సర్పంచ్ మరియు వార్డులకు , రామేశ్వరం, అచ్యుతాపురత్రయం, పెద్దాడ, సంపర,చింతపల్లి గ్రామాలకు సర్పంచ్ మరియు అన్ని వార్డు సభ్యులకు ఈ నెల29 తేదిన ఎన్నికలు జరుగునని ఇప్పటికే బ్యాలట్ పేపర్ పరిశీలిన పూర్తిఅయినదని, పిఓ లకు గాంధీ స్మారక ఉన్నత పాఠశాల, పెదపూడి నందు శిక్షణ పూర్తి అయిందని, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కొవ్వూరి నరేందర్ రెడ్డి, ఉప మండల అభివృద్ధి అధికారి మేడపాటి సత్యనారాయణరెడ్డి, పరిపాలనాధికారి శ్రీనివాసరావు, మండల స్వర్ణ గ్రామం అధికారి కే.వి.భానుజి, జి.మామిడాడ పిడిఓ నాగేంద్ర కుమార్ తెలిపారు.