శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య
సర్పంచ్ గా ఆశీర్వదిస్తే...గ్రామాభివృద్యే లక్ష్యంగా పనిచేస్తా. - శ్రీపతిరావుపేట సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య
- మంచం గుర్తుపై ఓటేసి గెలిపించాలంటే గ్రామంలో ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : శ్రీపతిరావు పేట గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య అన్నారు. గురువారం మండలంలోని శ్రీపతిరావు పేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య మంచం గుర్తుపై ఓటేసి గెలిపించాలంటూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని తపనతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గ్రామ ప్రజలు సహకరించి సర్పంచిగా ఆశీర్వదిస్తే అభివృద్ధితో పాటు గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. గ్రామంలోని ప్రతి వార్డులో మౌలిక వసతులతో పాటు పారిశుద్ధ్యం లోపించకుండా చూస్తూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పుతూ ఆదర్శ గ్రామంగా వార్డు మెంబర్ల ప్రజల సహకారంతో తీర్చిదిద్దుతానని ప్రచారంలో ముందుకు సాగారు. మంచం గుర్తుపై ఓటేసి గెలిపిస్తే నాయకుడిగా కాకుండా గ్రామ ప్రజలకు సేవకుడిగా సేవలందిస్తూ అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.