BREAKING
అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి మద్దతుదారులను గెలిపించండి సాంప్రదాయ కళల ప్రోత్సాహంతో సమాజ శ్రేయస్సు -శంకర విజయేంద్ర సరస్వతి స్వామీ ఉద్ఘాటన ఎన్నికల నిబంధనలకు లోబడి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు అడ్డతీగల సర్పంచ్ గా బీర వెంకటలక్ష్మి ఉత్కంఠ భరితంగా ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు -బాలికల వాలీబాల్‌లో పలమనేరు చాంపియన్ -రెండో రోజూ హోరాహోరీ తలపడ్డ క్రీడాకారులు అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ శివలింగాల దర్శనం మహాపాతక నాశనం

రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం..

Select Suryaa Now
రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు (శుక్రవారం, నవంబర్ 27) ఉదయం 10 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. వాస్తవానికి గురువారం (నవంబర్ 26) జరగాల్సిన ఈ భేటీ, రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శుక్రవారానికి వాయిదా పడింది. వ్యక్తిగతంగా హాజరుకాలేని మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేలా ఈ సమావేశాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ), రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) సమావేశాల్లో ఆమోదించిన పలు కీలక ప్రతిపాదనలు, భారీ పెట్టుబడులు, రాజధాని నిర్మాణ పనులకు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల తేదీలు, షెడ్యూల్ ఖరారుపై కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.