BREAKING
రాజ్యాంగ విలువలే దేశాభివృద్ధికి పునాది -డెయిరీ టెక్నాలజీ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం కొణికి సర్పంచ్‌గా చంద్రశేఖర్‌ అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి మద్దతుదారులను గెలిపించండి సాంప్రదాయ కళల ప్రోత్సాహంతో సమాజ శ్రేయస్సు -శంకర విజయేంద్ర సరస్వతి స్వామీ ఉద్ఘాటన ఎన్నికల నిబంధనలకు లోబడి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు అడ్డతీగల సర్పంచ్ గా బీర వెంకటలక్ష్మి ఉత్కంఠ భరితంగా ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు -బాలికల వాలీబాల్‌లో పలమనేరు చాంపియన్ -రెండో రోజూ హోరాహోరీ తలపడ్డ క్రీడాకారులు అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి

శివలింగాల దర్శనం మహాపాతక నాశనం

Select Suryaa Now
శివలింగాల దర్శనం మహాపాతక నాశనం

కాకినాడ, మేజర్ న్యూస్ : కార్తీక మాసం సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కోటిలింగాల క్షేత్రాన్ని పోస్టల్ శాఖ విశ్రాంతి అధికారిణి శ్రీమతి పాలూర్ హేమమాలిని భీమసేన్ రావు సారధ్యంలో ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ యాతగిరి పరశురామ్ తుంగమణి దంపతులు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ శివలింగ దర్శనం మహాపాతక నాశనమని అందుకే కార్తీక మాసంలో విష్ణు ఆరాధన తో పాటు  శివారాధనకు అధిక ప్రాధాన్యత కల్పించబడిందన్నారు. ఈ మాసం అంతా నక్షత్ర దీపారాధన, తులసి బృందావనం  దగ్గర ప్రత్యేక పూజలు మరియు ధాత్రీ పూజ హోమాలు, వనభోజనాధి కార్యక్రమాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించుకుంటారని చెప్పారు. అన్ని విష్ణు ఆలయాలతో పాటు శివాలయానికి కూడా భక్తులతో అత్యంత రద్దీగా ఉంటుందన్నారు. దీప దానాలతో పాటు నూతన వస్త్రాలను కూడా బ్రహ్మాణులకు అందించడం భగవంతుని ప్రీతికరంగా భక్తులు భావిస్తారని అన్నారు.కోటిలింగాల దర్శనం అద్భుతంగా ఉందని ఆధ్యాత్మిక క్షేత్రంగా కలియుగంలో మనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. బైరుపల్లి  గ్రామ దేవత అయిన పటాలమ్మ ఆరాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పాలూర్ భీమసేన రావు నిర్వహించగా అలంకార కార్యక్రమాన్ని అద్భుతంగా శ్రీమతి హేమమాలిని నిర్వహించడం భక్తులందరికీ ఎంతో ఆనందం కలిగించింది. అమ్మవారికి నూతన వస్త్రాన్ని శ్రీమతి తుంగమణి సమర్పించుకున్నారు.
       కార్యక్రమంలో విద్యావేత్త డాక్టర్ పాలూర్ శ్రీవిద్య మోహన్ కృష్ణ దంపతులు,  అమూల్య రుక్మిణి కృష్ణ చైతన్య దంపతులు, లక్ష్మీకాంత్, దీక్షిత,పాలూర్ జానకిరామ్ , పాలూర్ శ్రీనివాసరావు, యాతగిరి మద్వేష్, శ్రీమతి మౌనిక,శ్రీ రమామణి, రఘోత్తమ, సోము,హనుమంతు, గోపాల్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.