BREAKING
అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి మద్దతుదారులను గెలిపించండి సాంప్రదాయ కళల ప్రోత్సాహంతో సమాజ శ్రేయస్సు -శంకర విజయేంద్ర సరస్వతి స్వామీ ఉద్ఘాటన ఎన్నికల నిబంధనలకు లోబడి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు అడ్డతీగల సర్పంచ్ గా బీర వెంకటలక్ష్మి ఉత్కంఠ భరితంగా ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు -బాలికల వాలీబాల్‌లో పలమనేరు చాంపియన్ -రెండో రోజూ హోరాహోరీ తలపడ్డ క్రీడాకారులు అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ శివలింగాల దర్శనం మహాపాతక నాశనం

మన ఓటే.. మన భవిష్యత్తు!

Select Suryaa Now
మన ఓటే.. మన భవిష్యత్తు!

- ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత
- జెన్‌ జీ యువత పోలింగ్‌లో చురుగ్గా పాల్గొనాలి
- ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గొద్దు
- రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు పిలుపు
- కాకినాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో : మన భవిష్యత్తును నిర్ణయించే శక్తి మన ఓటుకు ఉందని, దానిని వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా గురువారం స్టేడియం రోడ్డులోని హౌసింగ్‌ బోర్డు కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన 66/2 పోలింగ్‌ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు.

జెన్‌ జీ యువత ముందుకు రావాలి..

నేటి యువత రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని ఎంపీ సూచించారు. ముఖ్యంగా జెన్‌ జీ యువత ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలమని పేర్కొన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు..

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతుండటం సంతోషకరమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాకినాడలో ప్రశాంత వాతావరణం నెలకొందని, ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

ఓటు మన హక్కు.. మన బాధ్యత..

యువత, మహిళలు, వృద్ధులు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్య విజయానికి ఓటే తొలి మెట్టని, ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని ఎంపీ సానా సతీష్‌బాబు పిలుపునిచ్చారు.