ద్వారకామాయి కాలనీ అభివృద్ధికి రూ.23 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు
కీసర, మేజర్ న్యూస్: గోధుమకుంటలోని ద్వారకామాయి కాలనీ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. కాలనీలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.23 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ద్వారకామాయి కాలనీ మెయిన్ రోడ్డు నుంచి శివసాయి కాలనీ వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానికుల రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రహదారి సమస్య పరిష్కారం కానుంది.రోడ్డు మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మాంచాల ప్రవీణ్ కుమార్, నాగారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూమయ్య యాదవ్‌లకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం కాలనీ అధ్యక్షురాలు సుమతి ఆహ్వానం మేరకు మాంచాల ప్రవీణ్ కుమార్ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు చీర శేఖర్, శ్రీధర్ రెడ్డి, చీర శ్రీశైలం, రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.