BREAKING
గంగవరంలో ఎల్లంపల్లి మురళి ఘన విజయం 1080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు బిర్యానీ తినాలంటూ పరిచయం.. నిర్మానుష్య ప్రాంతంలో బెదిరించి దోపిడీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని సన్మానించిన కూర్మాయి సర్పంచ్ విజయ మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్

మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి

Select Suryaa Now
మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి

కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లె సమీపంలోని మిట్స్ (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియమితులైనట్లు యూనివర్సిటీ వ్యవస్థాపకులు,ఛాన్సలర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి తెలిపారు.గురువారం ఆయన యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉన్నతాధికారులు,అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం,నైపుణ్యాలను పెంపొందించడం,మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా సమష్టి కృషితో ముందుకు సాగుదామని పేర్కొన్నారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక,వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అధ్యాపకులు నిరంతరం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యార్థులకు ఉత్తమ మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.ఈ సందర్భంగా మిట్స్ యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ ఎన్.ద్వారకనాథ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల నూతన వైస్ ఛాన్సలర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు.యూనివర్సిటీ ఉన్నతాధికారులు డాక్టర్ సి.యువరాజ్,డాక్టర్ ప్రదీప్ కుమార్,పి.రామనాథన్ తదితరులు,అధ్యాపకులు,సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి