BREAKING
అమెరికా విమాన సుంకాలతో విమానయాన సంస్థలకే నష్టం పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పడావు పెట్టారు.. ఈసీబీ తదుపరి సారథిగా పాబ్లో హెర్నాండెజ్ డి కోస్ పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌పై విచారణ ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం రాజ్యాంగ రక్షణకు కేఎల్ఆర్‌ కదం! అభ్యర్థులు లేకుండానే హోరాహోరీగా ప్రచారం రంగంలోకి దిగిన కుటుంబ సభ్యులు.. పోటాపోటీగా నాయకుల పర్యటనలు జేఎన్‌టీయూఏలో 9 మందికి ఉద్యోగాలు.. టీడీపీకి ఇంటిపోరు.. వైసీపీకి కలిసొచ్చేనా? రెబల్స్‌ ఎఫెక్ట్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? గుర్తులతో కూడిన కండువాలను బహుకరించిన రాజేష్ జేఎన్‌టీయూఏలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు.. బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో కీలక ఒప్పందానికి ముందడుగు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: DMHO డా. కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.. నంది సర్కిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిసి రోడ్డు పనులు ప్రారంభం.. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి – కలెక్టర్ నారాయణ రెడ్డి

టీడీపీకి ఇంటిపోరు.. వైసీపీకి కలిసొచ్చేనా? రెబల్స్‌ ఎఫెక్ట్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Select Suryaa Now
టీడీపీకి ఇంటిపోరు.. వైసీపీకి కలిసొచ్చేనా? రెబల్స్‌ ఎఫెక్ట్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

ప్యాపిలి, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీకి రెబల్స్‌ బెడద పట్టుకుంది. అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తి, టికెట్లు ఆశించి భంగపడిన ఆశావహులు స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ మొదలైంది.

ముఖ్యంగా మండలంలోని పెద్ద పంచాయతీలైన ప్యాపిలి మేజర్‌ గ్రామ పంచాయతీతో పాటు జలదుర్గంలోనూ రెబల్స్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వీటితో పాటు కలచట్ల, జక్కసానికుంట్ల, బావిపల్లి, చిన్న పూజర్ల, మాధవరం, ఊటకొండ, కౌలుపల్లి, నేరేడుచర్ల, బూర్గుల, కొమ్మెమర్రి, సీతమ్మ తండా, బొంచెరువుపల్లి తదితర గ్రామాల్లోనూ రెబల్స్‌ పోటీలో నిలిచారు.

ఓట్లు చీలితే వైసీపీకి లాభమా?

అధికార పార్టీ అభ్యర్థులకు పోటీగా సొంత పార్టీకి చెందిన అసంతృప్తులే బరిలో నిలవడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ఒకే పార్టీకి చెందిన ఓటు బ్యాంకు అధికారిక అభ్యర్థులు, రెబల్స్‌ మధ్య చీలిపోయే అవకాశంపై రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ పరిణామాలు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి ఏ మేరకు అనుకూలంగా మారతాయన్నది చర్చనీయాంశమైంది. టీడీపీ ఓట్లు చీలితే వైసీపీ అభ్యర్థులకు పోటీ పరంగా కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రెబల్స్‌ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది వారి వ్యక్తిగత బలం, స్థానిక ప్రజాదరణ, సామాజిక సమీకరణాలు, ఓటర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు పార్టీ అధిష్ఠానం అసమ్మతిని చల్లార్చి రెబల్స్‌ను బుజ్జగించి పోటీ నుంచి తప్పిస్తుందా? లేక వారు బరిలో కొనసాగుతారా? అన్నది వేచి చూడాలి.