BREAKING
ఐఐటీఎఫ్ 2026లో ఆయుష్ పెవిలియన్ సందడి సాగర్ నుంచి ప్రపంచ వేదికపైకి.. హైదారాబాద్ యాచ్ క్లబ్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ సెయిలింగ్ ఇంపాక్ట్ అవార్డు! మాజీ లోక్‌సభ స్పీకర్ రబీ రే జయంతి 2029 తర్వాత డ్రగ్స్ సరఫరా చేస్తే అమీర్‌పేట్ చౌరస్తాలో పాతరేస్తాం.. రాజ్యాంగ దినోత్సవం వేళ 22 భాషల్లో నవీకరించిన భారత రాజ్యాంగం ఆవిష్కరణ అమెరికా విమాన సుంకాలతో విమానయాన సంస్థలకే నష్టం పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పడావు పెట్టారు.. ఈసీబీ తదుపరి సారథిగా పాబ్లో హెర్నాండెజ్ డి కోస్ పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌పై విచారణ ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం రాజ్యాంగ రక్షణకు కేఎల్ఆర్‌ కదం! అభ్యర్థులు లేకుండానే హోరాహోరీగా ప్రచారం రంగంలోకి దిగిన కుటుంబ సభ్యులు.. పోటాపోటీగా నాయకుల పర్యటనలు జేఎన్‌టీయూఏలో 9 మందికి ఉద్యోగాలు.. టీడీపీకి ఇంటిపోరు.. వైసీపీకి కలిసొచ్చేనా? రెబల్స్‌ ఎఫెక్ట్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? గుర్తులతో కూడిన కండువాలను బహుకరించిన రాజేష్

అభ్యర్థులు లేకుండానే హోరాహోరీగా ప్రచారం రంగంలోకి దిగిన కుటుంబ సభ్యులు.. పోటాపోటీగా నాయకుల పర్యటనలు

Select Suryaa Now
అభ్యర్థులు లేకుండానే హోరాహోరీగా ప్రచారం రంగంలోకి దిగిన కుటుంబ సభ్యులు.. పోటాపోటీగా నాయకుల పర్యటనలు

ప్యాపిలి,  మేజర్ న్యూస్: ప్యాపిలి పట్టణంలో సర్పంచి ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా సాగుతోంది. బరిలో ఉన్న అభ్యర్థులు నేరుగా క్షేత్రస్థాయిలోకి రాకపోయినా.. వారి తరఫున కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు బాధ్యతలు భుజానికెత్తుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.వైకాపా తరఫున: సర్పంచి అభ్యర్థి రంగనాయకులు తరఫున ఆయన సోదరుడు జయన్నతో కలిసి నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, రాజా మురళీకృష్ణ, గడ్డం భువనేశ్వర్‌రెడ్డి, బోరా మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో దళితవాడలో భారీగా ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో బోరెడ్డి రాము, చిన్న సుంకయ్య, మస్తాన్‌ఖాన్, వి.శ్రీనివాసరెడ్డి, బోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బోరెడ్డి రఘు, నిజాం, బషీర్, పర్వతం శ్రీను, చిన్న రామంజి, పెద్దిరాజు, సంజీవరెడ్డి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.స్వతంత్ర అభ్యర్థి తరఫున: ఖాజాపీరా తరఫున ఆయన సోదరుడు సుభాన్‌తో కలిసి మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ రాజనారాయణమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు గడ్డం అంకిరెడ్డి, చల్లా వీరాంజనేయులు ఆధ్వర్యంలో బీసీ కాలనీలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇందులో బర్మా శ్రీధర్, వెంకటేష్, వార్డు సభ్యుడు మనోహర్, ఎస్కే వలి, సయ్యద్ అక్బర్ వలి, రాజా రవి, సిబిల్లి రంగన్న, డిష్ శీను తదితరులు పాల్గొన్నారు.ఒకేసారి వేర్వేరు కాలనీల్లో ఇరువర్గాల నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్థులు లేకుండానే అనుచరులు ప్రచార బాధ్యతలు మోయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.