BREAKING
ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం రాజ్యాంగ రక్షణకు కేఎల్ఆర్‌ కదం! అభ్యర్థులు లేకుండానే హోరాహోరీగా ప్రచారం రంగంలోకి దిగిన కుటుంబ సభ్యులు.. పోటాపోటీగా నాయకుల పర్యటనలు జేఎన్‌టీయూఏలో 9 మందికి ఉద్యోగాలు.. టీడీపీకి ఇంటిపోరు.. వైసీపీకి కలిసొచ్చేనా? రెబల్స్‌ ఎఫెక్ట్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? గుర్తులతో కూడిన కండువాలను బహుకరించిన రాజేష్ జేఎన్‌టీయూఏలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు.. బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో కీలక ఒప్పందానికి ముందడుగు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: DMHO డా. కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.. నంది సర్కిల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సిసి రోడ్డు పనులు ప్రారంభం.. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి – కలెక్టర్ నారాయణ రెడ్డి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఎస్.వి. డిగ్రీ, పీజీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ జిల్లా స్థాయి PPT పోటీల్లో ఆరుగురికి రాష్ట్ర స్థాయి అవకాశం

జేఎన్‌టీయూఏలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు.. బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో కీలక ఒప్పందానికి ముందడుగు

Select Suryaa Now
జేఎన్‌టీయూఏలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు..  బజాజ్ ఆటో ఫౌండేషన్‌తో కీలక ఒప్పందానికి ముందడుగు

అనంతపురం విద్య, మేజర్ న్యూస్:-పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తూ, అనంతపురంలోని జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఫర్మ్‌వేర్ అభివృద్ధి రంగాల్లో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేసేందుకు జేఎన్‌టీయూఏ, బజాజ్ ఆటో ఫౌండేషన్ ముందడుగు వేశాయి.
ఈ మేరకు గురువారం జేఎన్‌టీయూఏ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బజాజ్ ఆటో ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీమతి ప్రాంజలి దీప్ (లీడ్ – పార్ట్‌నర్‌షిప్స్), శ్రీ చైతన్య సోనునే (మేనేజర్ – సెంటర్ ఆపరేషన్స్), శ్రీ కరణ్ హడవే (ఆర్కిటెక్ట్) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. పరిశ్రమల సహకారంతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ప్రతినిధి బృందం ప్రొఫెసర్ సి. శోభా భిందు (నోడల్ ఆఫీసర్), ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి (ప్రిన్సిపాల్), ప్రొఫెసర్ దిలీప్ కుమార్, డాక్టర్ రామశేఖర్ రెడ్డితో కలిసి ఈఈఈ, ఈసీఈ విభాగాలను సందర్శించింది. ప్రతిపాదిత కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు, విద్యా వనరులను పరిశీలించింది.
ఈ సమావేశంలో రిజిస్ట్రార్, ఉపకులపతి ఓఎస్‌డీ, డైరెక్టర్లు, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్‌పర్సన్‌లు, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
ఈ కేంద్రాల ఏర్పాటుతో పరిశ్రమల ఆధారిత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..