ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: DMHO డా. కళ్యాణ్ చక్రవర్తి
రంగారెడ్డి : జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డా. కళ్యాణ్ చక్రవర్తి వైద్యాధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా DMHO కార్యాలయంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) మెడికల్ ఆఫీసర్లతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD), మాతా శిశు సంరక్షణ, ఇమ్యునైజేషన్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ తదితర కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రతి కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. PHCలకు వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ DMHO డా. పాపారావు, డిప్యూటీ DMHOలు డా. రాకేష్, డా. రాధిక, P.O. M.H.N. డా. సత్యరత్న, డా. సత్యవతి, డా. షేబా హయాత్, డా. వినోద్, P.O. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ డా. సోలోమన్‌తో పాటు జిల్లాలోని అన్ని PHCల మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, కార్యక్రమ అధికారులు పాల్గొన్నారు.
వి శ్రీనివాస చారి : రంగారెడ్డి -మేజర్ న్యూస్